ఈ సంగతి ఒక ముత్తుకూరు వాసి చెప్పగా విన్నాను. (విషయం లోకి పోయేముందు మీకు తెలియాల్సిన విషయం ఒకటుంది, అదేందంటె పిడతాపోలూరు, గాడిదవాగు అనేయి ముత్తుకూరు  దగ్గర ఉన్న రెండు ఊర్ల పేర్లు. ఇంక చదవండి).

ముత్తుకూరు దగ్గర ఒక కైయ్యలొ ఒక నెరజాణ ఎదో పని చేసుకొంటొంది. అటుగా వచ్చిన ఒక పూల రంగడు (పని పాట లేని వాడు) ఆమెను ఆట పట్టిచ్చాలనుకొన్నాడు. ఆమెను ఉద్దేసించి “పిడతా!   పోలూరుకి దారేది?” అని అడిగాడు అప్పుడు ఆమె “గాడిద!   వాగు దాటి పొతె వస్తుంది?” అని చెప్పింది.

ఇది విన్న నాకు, RTC వారు బస్సులొ వ్రాసే “స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం …..” అనే వాక్యం గుర్తుకొచ్చింది. స్త్రీలను గౌరవించండి, నెల్లూరి నెరజాణలని ఇంకొంచం ఎక్కువ గౌరవించండి.

 

– నెల్లూరోడు